దశరథుడు కౌసల్యా మందిరమును ప్రవేశించి విలపించుట : - ఎడ్ల లక్ష్మి సిద్ధిపేట


దశరథమహారాజు బాధతో ఇలా అంటాడు 
ఓ కౌసల్యా! రాముడు అడవికి చేరినాక 
నేలపై పడుకుని రాతిని తల కింద పెట్టుకొంటాడు 
నదిలోన చన్నీటి స్నానమును జేయును 

సుకుమారమైన జనకుని కూతురు సీత
వనమున క్రూర మృగముల అరుపులకు 
భయముతో వణుకుచూ నిద్రపోదేమో 
కైకతో ఆ తల్లికి ఎంత కష్టము వచ్చెను

ఓ కైకేయీ! నా రాముడు లేకుండా నేను జీవించలేను 
అప్పుడు నీ కోరికలన్నియు తీరును 
ఈ రాజ్యమున నీవు విదువవైయుండుము
భరతుడు కూడా నిన్ను క్షమించడు

కౌసల్యా మందిరమునకు నన్ను గొనిపొండు
ద్వార పాలకులు దశరథ మహారాజను 
కౌసల్య మందిరమునకు తీసుకెళ్లినారు 
ఆ రాత్రి అతనికి కాళరాత్రిగా గడిచెను 

మధ్య రాత్రి నిద్ర లేచి దశరథ మహారాజు
కౌసల్యా దేవితో ఇలా అంటాడు 
కళ్ళు మూసిన తెరిచిన రాముని రూపమే 
అతని మాటలు విని కౌసల్యాదేవి శోకిస్తుంది .

============================

అయోధ్యకాండము నందు 42వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు