గునుగుపూల గుమ్మ: - డా. కందేపి రాణీప్రసాద్


 హలో పిల్లలూ! గునుగు పూలతో బతుకమ్మను తయారు చేస్తా కదా! బతుకమ్మ పండుగ సంబరాలలో గునుగు పూలకు రంగులు వేసి అందంగా అలంకరిస్తాం కదా ! నేనిప్పుడు గునుగుపూలతో అమ్మాయిని తయారు చేశాను. మా ఇంటి కుండీలలో ఎవరూ వేయకుండానే గునుగు పూల చెట్లు మొలిచాయి. అలాగే సీతమ్మ వారి జడల పూల చెట్లు కూడా మొలిచాయి. పెద్ద పెద్ద సీతమ్మ జడ ముద్దులు పూశాయి. గునుగు పూలేమో మేడను అందుకోవాలన్నట్లుగా పోడుగ్గా కాశాయి. ఇందులో బంతుల్ని కూడా వాడాను. అలాగే ఆసుపత్రి వ్యర్థాలైన ప్లాస్టిక్ ఇంజెక్షన్ దూతలు సైతం ఉపయోగించాను. కొంతమంది గునుగు చెట్ల ఆకుల్ని ఆకు కూరగా వాడుకుంటారు. ఇది గడ్డి జాతికి చెందిన మొక్క అందుకే దీని పూవులు ప్లాస్టిక్ వలె కనిపిస్తాయి. కేరళ రాష్ట్రంలో అలప్పుజా, కాసరగాడ్, మలప్పురం, పాలక్కాడ్, కన్మూర్, కోజిక్కోడి జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తుంది. నేను కేరళలోని ఈ జిల్లాలన్నీ తిరిగి చూశాను. గునుగు పువ్వును ఇంగ్లీషులో " సిల్వర్ స్పైక్‌డ్ కాక్స్ కాంబ్ " అని అంటారు. మలయాళంలో చెరువిరా అనీ, తమిళంలో పన్నైపూ, మాకిలిక్కరై అనీ పిలుస్తారు.
 ఇంజెక్షన్ మూతలతో పాపాయి శరీరాన్ని సృష్టించాను. ఈ పాపకు గునుగు పూల లెహంగా కుట్టాను. బంతి రెక్కల బ్లౌజు వేశాను. సీతమ్మ వారి జడలు లెహంగా కింద బార్డర్ వలె కుట్టాను. బ్లౌజుకు గునుగు పూల నూకను అక్కడక్కడా చల్లాను. బ్లౌజ్ చేతులకు బిళ్ళ గన్నెరు కుచ్చులు పెట్టాను. రెండు జడలు పైకి కట్టుకొని ఆకుపచ్చ రిబ్బన్లు వేసుకున్నది.
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం