సుప్రభాత కవిత : - బృంద


మనసంత నిండే 
మధురమైన ఉత్సాహం 
మేఘాల దారిలో 
మెరిసే రంగుల రధం

మిరుమిట్లు గొలుపుతూ 
మౌన విస్ఫోటనం 
మింటి తోటలో విరిసే 
ఒంటరి వెలుగుపుష్పం

నింగిని సాగే వెలుగుల 
పొంగే బంగరు రంగులు 
వంగి నేలను తాకిన 
పసిడి కాంతుల ధారలు

వేల రెక్కలకు ఒక్కసారిగా 
గగనపు అంచును చేరే 
తలపుకు తోడైన 
ఉరికే ఉత్సాహం

నీటిలో మబ్బులు చూసి 
నింగి  నేలకు దిగినదేమోనని 
బిత్తర చూపులు చూస్తూ 
చిత్తరువై నిలిచిన విహంగాలు

కోటి కాంతులు కురిపిస్తూ 
నేటి శాంతిని అందుకోవాలని 
వేచి వున్న హృదయాలకు 
వేడుక నివ్వాలని వచ్చే వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు