24 కుందేళ్ల నుంచి కోట్లకు వాటి సంఖ్య పెరిగి — ఒక ఖండాన్నే మార్చేసిన కథ! ఒక్కసారి ఆలోచించండి, కేవలం 24 కుందేళ్లు ఒక పెద్ద ఖండాన్నే నాశనం చేయగలవా? 1859లో ఆస్ట్రేలియాలో జరిగింది సరిగ్గా ఇదే. ఇంగ్లాండుకి చెందిన థామస్ ఆస్టిన్ అనే వ్యక్తి, తన సొంత స్థలంలో వేటాడటం కోసం 24 ఐరోపా కుందేళ్లను స్వదేశం నుంచి తీసుకొచ్చి విడిచిపెట్టాడు. ఇంగ్లండులో లాగానే కుందేళ్ల వేటను ఆస్ట్రేలియాలో కూడా అనుభవించాలనేది అతని చిన్న కోరిక. కానీ ఆ చిన్న కోరికే చరిత్రలోనే అతి పెద్ద ఆక్రమణగా మారింది.
ఆస్ట్రేలియాలో కుందేళ్లను వేటాడే సహజ శత్రువులు లేరు, వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది, తినడానికి గడ్డి, మొక్కలకు అసలు కొదవే లేదు. దీంతో కొన్నేళ్లలోనే ఆ 24 కుందేళ్లు కొన్ని కోట్ల సంఖ్యలోకి పెరిగాయి. దీని ఫలితం చాలా దారుణంగా మారింది. పొలాల్లోని పంటలను తిని నాశనం చేశాయి. అడవుల్లో మొక్కలు లేకుండా పోవడంతో నేలకోత ఏర్పడింది. అక్కడ పుట్టి పెరిగిన చాలా స్థానిక ఆస్ట్రేలియా జంతువులకు తిండి, నివాసం లేకుండా పోయి అవి అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. దీన్ని అదుపు చేయడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? వేల పొడవునా కుందేళ్లను అడ్డుకునే భారీ కంచెలను నిర్మించింది. ఆ తర్వాత 'మైక్సోమా' వైరస్, 'ఆర్‌హెచ్‌డీవీ' (RHDV) వంటి జీవ నియంత్రణను ఉపయోగించారు. దీనివల్ల కాస్త తగ్గినా, నేటికీ ఆస్ట్రేలియా పర్యావరణానికి అతిపెద్ద ముప్పుగా ఈ కుందేళ్లే ఉన్నాయి.
ఒక మనిషి తీసుకున్న చిన్న నిర్ణయం, ఒక ఖండపు పర్యావరణ వ్యవస్థనే ఎలా మార్చుతుందో అనడానికి ఇదే ఉత్తమ ఉదాహరణ.
ఈ సమాచారానికి మూలం CSIRO, ఆస్ట్రేలియా ప్రభుత్వ పర్యావరణ పత్రాలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి