సాటి ఎవరే నీకు అమ్మా
మాదు మదిలో నిలిచినావూ
మరవలేమే ఎప్పుడు!!
వేలకొద్దీ పాటలెన్నో
పాడి మనసుల గెలిచినావో
బిరుదులెన్నో వరించి వచ్చె
పద్మభూషణ వదిలితో!!
నాద స్వరము పోటి పడగా
గొంతులోనను పలికినావో
నవరసాలను మాధురీఝరి
సులువుగా ఒలికించితో!!
సిరిమల్లెల సౌందర్యమును
చిన్నిపాపల నవ్వు నంతయు
వృద్ధ నారీ వణుకుపలుకుల
గొంతులోంచి పలికించితో!!
ఎన్ని భాషల పాడి నావో
భావములనే లోతుగానే
రసము లొలుకగ చక్కగానే
వినిపించిన గాయనమ్మ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి