బిజినేపల్లి మండలంలో మూడు రోజులపాటు జరుగుతున్న డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ లో విశ్రాంత అధ్యాపకులు డా ప్రతాప్ కౌటిళ్యా కవితా సంపుటిని ఆవిష్కరించిన బిజినేపల్లి బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయినిలు శ్రీమతి సునీత ప్రతాప్ మరియు సూర్య కళ గారు ఇతర ఉపాధ్యాయులు.
డా ప్రతాప్ కౌటిళ్యా సతీమణి శ్రీమతి సునీత ప్రతాప్ ఉపాధ్యాయిని మరియు కవయిత్రి కావడం విశేషం ఆమె ప్రోత్సాహంతోనే కౌటిల్య ఎదుగుతున్నారని ఉపాధ్యాయుని శ్రీమతి సూర్య కళ ఈ సందర్భంగా చెప్పారు.
డా ప్రతాప్ కౌటిళ్యా మూడు దశాబ్దాల నుంచి రచనలు చేస్తూ సైన్సు సాహిత్యంలో కృషి చేస్తున్నారని ఇప్పటివరకు నాలుగు సైన్సు పుస్తకాలు రెండు కవితా సంపుటులను విలువరించారని. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ బయో కెమిస్ట్రీ చదివి జెఎన్టియుహెచ్ లో ఎంటెక్ బయోటెక్నాలజీ చేశారని. ఇటీవలన అంతర్జాతీయ శ్రీ శ్రీ కళావేదిక వారి నుంచి జాతీయ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారని. డాక్టర్ సి. నారాయణరెడ్డి డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి ఆరుద్ర తొలి తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ తూమాటి దొనప్ప శతాధిక గ్రంథకర్త ఎంఎన్ రావు లాంటి సాహితీ దిగ్గజాలతో పాటు కవిత గానం చేసి ప్రశంసించబడ్డారని. హెచ్ఎం కృష్ణయ్య గారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
సూర్య కళ ఉపాధ్యాయిని బిజినేపల్లి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి