సామెత -303: -ఇంటికి సుట్టమొస్తే పొట్టగంజోడికి దుఃఖం
**
"పాపం గా మల్లయ్య మావఁను సూత్తె మస్తు ఇదినిపిచ్చిందవ్వా!అసలే వొయిసుడిగినోడు. బతుకు తెర్వు కోస్రం కొడుకులు కాన్రాని దేశాలకి బోయిండ్రా.అత్తనేమో శాత గాని మడిషి.ఒక్కని రెక్కల మీద ఇల్లు నడుత్తున్నది.
" ఏమైంది శెల్లే?గియ్యన్ని గిప్పుడెందుకు శెప్తున్నవ్? మావ కొడ్కులు పదో పర్కో పంపియ్యట్లే.మల్లయ్య మావఁని,అత్తని సూడక శానా దినాలయ్యింది.
"పదో పర్క గాదు గద ముద్ద పైస సుత పంపట్లేదంట. ముసలోల్ల పించిని డబ్బులు అత్త మందులకయితున్నయంట. మీ మావఁ కట్టం సూల్లేక పోతున్నని కమలత్త కండ్ల నీళ్ళు బెట్కుంటే ఎట్లనో అనిపిచ్చిందవ్వా!"
"అయ్యో!అవునా శెల్లే? మావఁ ఏనాడు నోరిప్పి కొడ్కుల ముచ్చెటి శెప్పలే. బాగనే బత్కుతుర్రు అనుకున్న గని గింత బాద కడ్పులుందని తెల్వలేదు శెల్లే! "
" అవునవ్వా ! మస్తు మొగమాటత్తుడు. ఎన్నో త్యేపల అత్త బలానికి ఏవన్న పండ్లు కొనుక్కోరాదె అని వొందో యాబయో శేతుల బెట్టబోతే మావఁ ఉర్రికొచ్చి వొద్దు బిడ్డా నేను మందులకి పట్నమెల్లినపుడు సేపులు, అర్టికాయలు తెత్తనే ఉన్నని అత్తని అస్సలు తీస్కోనియ్యలేదు. అగ్గో గంత అబిమానం గల్లోడు మావఁ"
"ఏమో శెల్లే! మావఁ యిష్యం శెప్తుంటె నాకు సుత బాధనిపిత్తుంది. గంత అబిమానం,మొగమాటాన్కి బోతే కడ్పు నిండుద్దా శెప్పు.అయిన గని అమ్మ నాయినలు ఎట్లుండ్రో అన్న జ్యాస లేని కొడ్కులు ఏం కొడ్కులే తల్లీ!శిన్నతనాన గాల్లని కాలికి మట్టి అంటకుండ పెంచిర్రు.బాగ సద్విచ్చాలని ఆశ బడ్తె పెద్దోడికి సద్వు అబ్బక పన్లకి దిగిండని. శిన్నోడు సర్కారు ఉజ్జోగం పోటీల్ల గెల్వలేక గాడేడనో కంపినీల శేయబోయిండని యిన్న."
" అవునవ్వా! గాల్లు జేసే కట్టం బట్టకీ పొట్టకీ పొల్లగాండ్ల సద్వులకే సరిపోతల్లేదని పంపట్లేరంట.గీళ్ళ బత్కు ముచ్చెటి వొదిలి కొడ్కులు ఎట్ల బతుకుతుర్రో ఏమోనని రంది వడ్తుంది అత్త. "
" అగ్గో గదాన్నే కన్న పేగు పేమంటరు శెల్లే!గింతకీ అసలు ముచ్చెటి శెప్పవైతివి శెల్లే! "
" ఏండ్లేదవ్వా! మూలిగే నక్క మీద తాటికాయ బడ్డట్టు, గాల్లింటికి ఓ సుట్టమొచ్చి మూడ్రోజులైంది. నిన్న మాపటేల అటేపు బొయ్యినప్పుడు అత్తని మందలిచ్చబోతే శెప్పింది. గీళ్ళిద్దరి మొకాలు ఎన్ని దినాల్నించో లంకనాలు శేసినట్టుందవ్వా! సుట్టానికి బెట్టి గీళ్ళు కడ్పు మాడ్సుకుంటుర్రని అర్తమైంది. బొడ్లె దోపుకునే కీసల వొంద రూపాయిలున్నయి. గయ్యి దీసి తీస్కోక పోతే నా మీదొట్టే అని చెప్పి శేతుల బెట్టి వొచ్చిన. ఇంగ నయ్యం మావఁ గా సయిమంల ఎవలో కట్టెలు కొట్టిపెట్ట రమ్మంటే బోయిండట."
" అయ్యో అవునా శెల్లే! గస్మంటోళ్ళ "ఇంటికి సుట్టమొస్తే పొట్టగంజోడికి దుఖ్ఖం" అన్నట్టుంది. "
" అవునవ్వా " దినం దినం గండంగా గంజినీళ్ళతో పొట్ట నింపుకునేటోళ్ళ ఇంటికి ఎవలొచ్చినా కట్టమే. ఏమో అవ్వా! వొయిసులున్నప్పుడు రెప్రేపు మా బత్కులెట్లనో అని ముందు సూపుతో అంతో ఇంతో దాస్కోవాలె. గియ్యాల సూడు ఎంత కట్టమైతుందో. రెక్కలుడిగిన మడిషి ఇంకెంత కాలం కట్టపడ్తడు. గా మావఁ శాతగాక అడ్డం బడ్తే ఆదుకునే దిక్కెవలు శెప్పు. డబ్బులున్నోళ్ళ తాన లచ్చలు కోట్లు మూల్గుతుంటయి.గీ పేదోళ్ళ బత్కులేమో తిండికెల్లక గిట్లుంటయి. నేను సుత నచ్చ జెప్పి మల్లో ఐదొందలో వెయ్యో ఇచ్చొత్త!"
"ఇగ్గో శెల్లే నేను సుత వొత్తపా! పాలమ్మిన పైసలున్నయ్. వెయ్యో రొండేలో నేను సుత ఇత్త. "
"గదండీ సంగతీ "ఇంటికి సుట్టమొస్తే పొట్టగంజోడికి దుఖ్ఖం" అంటే గిదే మరి. వొయిసోళ్ళు, ముస్లోళ్ళు అని లేదు పేదర్కిం మడుసుల్ని గట్ల లోతున బడేత్తది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి