భక్తుల హృదయాల్లో భాసిల్లే దివ్య నిలయమై..!
యాదాద్రి పరిరక్షణ కోసం చేసిన చిన్న పని కూడా...
నరసింహుని పాదసేవలో అర్పించిన పుష్పమే..!
"గోవిందా... నరసింహా..." అంటూ గుండెల నిండా మొక్కుతాం,
గర్భగుడి దర్శనానంతరం గుడి నేలను చెత్తతో నింపుతాం..!
కొబ్బరికాయ కొట్టి కోరికలు తీర్చమని వేడుకుంటాం,
ప్లాస్టిక్ చెత్తతో పవిత్ర ప్రాంగణాన్ని కలుషితం చేస్తుంటాం..!
దేవుడికి పూలదండ వేయడం భక్తికి ఒక గుర్తయితే,
దేవుడి ఇంటి ఆవరణాన్ని శుభ్రంగా ఉంచడం భక్తికి పరమార్థమైతే...
పర్యావరణ పరిరక్షణే పరమపూజ అని పలుకుదాం..!
పచ్చని ప్రకృతినే పరమప్రసాదమని భావిద్దాం.
యాదాద్రిని దర్శించడమే కాదు... యాదాద్రిని రక్షిద్దాం..!
మన చేతులతో చెత్త తొలగించి సేవాభక్తిని చాటుదాం,
ప్లాస్టిక్‌కు వీడ్కోలు పలికి పచ్చదనానికి స్వాగతం పలుకుదాం,
ప్రతి మొక్కను నాటి భవిత తరాలకు వరమై నిలుద్దాం,
దేవాలయ ప్రాంగణంలో ప్రతి ప్లాస్టిక్ సంచి ప్లాస్టిక్
బాటిల్ మనకు శాపమని గుర్తుంచుకుందాం..!
శుభ్రమైన ప్రతి అడుగు శ్రీనరసింహునికి పుష్పార్చనే,
పచ్చదనంతో నిండిన ప్రతి ప్రాంగణం పరమాత్మకు హారతియే.
యాదాద్రి మహిమను కీర్తిస్తూ... ప్రకృతిని కాపాడుదాం,
భక్తి, శక్తి, శుభ్రతలతో స్వామివారి ఆశీస్సులు పొందుదాం..!
-----------------------------------------------------------------------
- శ్రీమతి మంజుల పత్తిపాటి
యాదాద్రి భక్తురాలు
చరవాణి 9347042218
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి