100వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఓ భరతా! రాజనీతిశాస్త్రమును అనుసరించి 
నలుగురు, లేక ముగ్గురు మంత్రులతో
విడివిడిగా గాని అందరితో గాని 
రహస్య ఆలోచనలు చేయుచున్నావా?

నాయనా! వేద శాస్త్ర ధర్మములను యెరిగి
నీవు కృతజ్ఞుడవు అవుతున్నావా? 
నీ భార్య అనుకూలవతిగా మెదులుతుందా? 
నీలోన సద్గుణములను పెంపొందిస్తుందా? 

ఓ భరతా నేను చెప్పినట్టి బోధనలను 
ధర్మముతో నీవాచరించుచుంటివా? 
నేను చేసిన బోధనలు జీవితంలో 
నీకు తప్పకుండా ఉపయోగపడును .

నాయనా! మన తండ్రి తాత ముత్తాతలును
ఆచరించిన ధర్మమును పాటించుచు 
నీవు రాజ్యపాలన వొనర్చుచున్నావా?
అదే సత్పురుషులు ఆచరించవలసిన ధర్మము. 
 
ఆత్మజ్ఞానీయై న్యాయ దండము చేబూని
ప్రజలను ధర్మబద్ధంగా పాలించినచో
సమస్తభూమండలము అతనికి వశమగును.
ఆ ఫలితముగా అతడు తనువు వీడినపిదప స్వర్గము చేరును.

========================================
అయోధ్యకాండమందు 100 వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు