101వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
 శ్రీరాముని అయోధ్యకువచ్చి రాజ్యాధికారమును చేపట్టమని భరతుడు, అభ్యర్థించుట 




శ్రీరాముని మాటలిని భరతుడు ఇట్లంటాడు
అన్నా! నిన్ను సేవించుటయే నా ధర్మము 
ఆ సేవకు నేను దూరమైనప్పుడు 
నాకు రాజ్యధర్మములతో పనియేమి?

ఓ నరోత్తమా! రాజ!కుమారులలో
పెద్దవాడుండగా కనిష్టుడు రాజుకాజాలడు 
మనవంశమున పరంపరగా వచ్చుచున్న 
స్థిరమైన ధర్మము ఇదియే కదా!

మన తండ్రి అశ్వమేధ యజ్ఞములను చేసి 
సత్పురుషుల గౌరవములను పొందినాడు 
నేను కేకయరాజ్యమున ఉండగా 
నీవు అరణ్యము చేరిన పిమ్మట 

నీ ఎడబాటు కారణముగా స్వర్గస్తుడైనాడు
ఓ పురుషోత్తమా! అగ్రజా! లెమ్ము 
తండ్రికి తిలోదకములను సమర్పింపుము 
నేను శత్రుజ్ఞుడు పితృతర్పణములను చేసితిమి 

మన తండ్రికి నీవు ప్రియపుత్రుడవు 
మహారాజుకు ప్రాణతూల్యుడవు గదా? 
మన తండ్రి నీ ఏడబాటు కారణముగా 
విలవిలలాడుచు పరమపదించెను. 

=================================
అయోధ్యకాండమందు 101టవ సర్గ సమాప్తం.🙏🏻
కామెంట్‌లు