102 వ సర్గ ; - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తన తండ్రి మృతికి శ్రీరాముడు విలపించుట 




భరతుని ద్వార తండ్రిమరణవార్తను విని 
శ్రీరాముడు తండ్రిని తలచుకొని దుఃఖిస్తూ 
అయ్యా! మమ్ము వీడి ఎక్కడికి వెళ్ళితివి! 
ఒక్కసారి రా తండ్రి అంటూ నేలమీద బడెను 

శ్రీరాముడు నేలపై పడి యుండగా
శ్రీరామునిచుట్టు
సీతాదేవి, ముగ్గురు సోదరులు జేరి 
ఏడ్చుచు తమ దుఃఖాశ్రువులచే
ఆయన శరీరమును పూర్తిగా తడిపిరి 

రాముడు క్రమముగా తేరుకొని స్పృహలోకి వచ్చి 
దీనముగా పెక్కు రీతుల విలపించుచుండెను 
తండ్రి మరణ వార్త విన్న రాముడు
ధర్మబద్ధముగా భరతునితో ఇలా అనెను 

సోదరా! మనతండ్రి కాలము చేసిన పిమ్మట 
అయోధ్యకు చేరి నేను ఏమి చేయగలను?
ఆ మహాత్ముని కోల్పోయి అనాథయైన
ఆ అయోధ్యనిప్పుడు ఎవరు పాలించగలరు? 

ఓ పుణ్యాత్ముడా! భరతా! నీవు శత్రఘ్నుడు
తండ్రి అంత్యసంస్కారములను జెసి 
ఆ విధముగా పితృఋణము తీర్చుకొంటిరి
నిజముగా నీవు ధన్యుడవు  భరతా!

కామెంట్‌లు