102 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి - సిద్ధిపేట


సమీపమునయున్న భరతుని సైనికులు 
ఆ రోదన ధ్వనులను విని భీతి చెందిరి 
ఆ సైనికులందరు గూడా కదలి
ఆపర్ణశాల వద్దకు బయలుదేరినారు 

వారి రథఅశ్వముల కాలి గిట్టల దుమ్ము 
దివిన ధూమమేఘములవలె యుండెను 
రథచక్రాల ధ్వనికి క్రూరమృగాలన్నియూ
పరుగులు తీస్తూ పారిపోవుచుండెను  

 శ్రీరాముడు దర్భాసనముపై కూర్చొని యుండగా 
ఆచటికి చేరిన జనులంతయు అతనిని దర్శించి
కన్నీరు మున్నీరుగా విలపించుచుండిరి
శ్రీరాముడు ఆ జనులను ఆశీర్వదించెను 

వచ్చిన జనులు ఆయనకు ప్రణమిల్లిరి 
రాఘవుడు చెంతకు వచ్చిన బంధుమిత్రులకు 
సమస్త స్వాగత మర్యాదలను జేసి
సముచిత రీతిలో గౌరవించెను. 

ఆ సమయమున ఆ మహాత్ముల రోదన 
ఆకాశము యందును వనమునను 
పర్వతగుహలయందు సకల దిశలయందు
ప్రతి ధ్వనిస్తూ మృదంగ గోషతూల్యమై అలరారెను.

=========================================
అయోధ్యకాండ యందు 102 వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు