103వసర్గ:- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


శ్రీరాముడు తనతండ్రికై గారపిండి పిండములను 
సమర్పించి యుండుట ఆమె జూచి 
మానవులు తాము భుజించేది ఆహారమే
దేవతలకు నైవేద్యముగావింతురు 

రామలక్ష్మణులు భుజించే పదార్ధములను 
తండ్రి పిండప్రధానమునకు సమర్పించిరేమో
సీతారామ లక్ష్మణులారా మీకేమి కష్టమిది అంటూ 
కౌసల్యాదేవి మిగుల దుఃఖించుచుండెను

దుఃఖిస్తున్న కౌసల్యను సౌమిత్రి ఓదార్చెను
వారందరూ ఆశ్రమము చేరి శ్రీరాముని దర్శించిరి 
శ్రీరాముని జూచి తల్లులు ఏడ్చుచుండిరి 
శ్రీరాముడు తల్లులకు  ప్రణమిల్లినాడు 

లక్ష్మణుడు తల్లులను చూసి దుఃఖించి
తల్లులకు అతడు పాదాభివందనం చేసెను
సీతాదేవి వారి పాదములకు నమస్కరించి 
కౌసల్యాదేవి వద్ద ఆమె మిక్కిలి దుఃఖించెను 

అమ్మా! సీతా! జనకమహారాజు కుమార్తెవు.
దశరథ ప్రభవుకు కోడలివి శ్రీరాముని ధర్మపత్నివైన 
నీకు ఎంతటి దుఃఖము ప్రాప్తించినది తల్లీ!
అంటూ కౌసల్యాదేవి శోకించుచుండెను.

కామెంట్‌లు