104 వసర్గ (2): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఓ మహాత్మా! జేష్టుడైన నీవే రాజ్యానికి అర్హుడవు 
న్యాయముగా ఈ కోసలదేశము నీకే చెందవలెను 
దీనిని పాలించుటకు నీవే సమర్థుడవు 
ధర్మమముననుసరించి రాజ్యమును స్వీకరించుము 

ఓ నర శ్రేష్రా! మంత్రులు, ప్రజలు ఎల్లరును 
రాముడే రాజ్యానికి రాజు అని అంటున్నారు 
వీరి మాటలను గౌరవించుము
వీరందరి ప్రార్ధనను నీవు త్రోసిపుచ్చకు. 

శ్రీరాముడు భరతుడిని కౌగిలించుకొని 
ఓ భరతా! నీవు ఉన్నత వంశమున పుట్టిన వాడవు 
సత్య గుణసంపన్నుడువి బలశాలివి 
నీవు ఎప్పుడు పాపానికి పాల్పడలేదు. 

ఓ సోదరా! నీ దోషమేమి కనబడుటలేదు 
అజ్ఞానముతో నీవు తల్లిని నిందింపరాదు 
పెద్దలకు సర్వాధికారములు ఉండును 
వారు తమ ఇష్టానుసారముగా ఆజ్ఞాపించవచ్చు.

నాయనా! తండ్రి గారి మాటను గౌరవించెదను 
దశరథ మహారాజు మానవలోకమున పూజ్యుడు
నా వనవాసదీక్ష ముగిసే వరకు నేను రాను 
మహాత్ముడిచ్చిన ఆజ్ఞయే నాకు పరమహితము భరతా!

===============================
అయోధ్యకాండమందు 104వ సర్గ సమాప్తము 🙏🏻
కామెంట్‌లు