105వ సర్గ (2) : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఓ భరతా! నీవు ఆత్మోర్ధణను గూర్చి ఆలోచించు.
ఇతరులకై ఎలా విచారపడెదవు
ఎవరైనను నిలిచియున్నను, సాగిపోవుచున్నను
అతనిఆయువు క్షీణించుచునే యుండును

ఈ లోకమునందు ఏప్రాణి అయినను  
జననమరణములను తప్పించుకోజాలరు 
మరణించిన వారికై శోకించేవారు
ఎంత కాలము ఉంటారు ఎవరు తెలుపగలరు?

ఓ భరతా! పుణ్యాత్ముడైన ఆ మహారాజు 
పదునాలుగు సంవత్సరములకాలము
వనములో నివసింపుమని నన్ను ఆదేశించెను 
నేను తండ్రి ఆజ్ఞప్రకారం ఇచ్చటనే యుండెదను

నాయనా! శత్రుసంహారకా! నా మాట వినుము 
తండ్రిగారి శాసనమును ఉల్లంఘించలేను 
దానిని త్రికరణశుద్ధిగా తలదాల్చెదను 
ఆయన ఆజ్ఞను నీవు గూడా పాటింపుము

ఓ భరతా! తండ్రి వాక్కును దృష్టిలో పెట్టుకొని 
రాజ్యభారమును వహింపుము"
భరతునకి తండ్రి ఆజ్ఞ పాటించమని 
శ్రీరాముడు తమ్మునికి దెలిపి మౌనము పాటించెను. 

====================================
ఓ భరతా! నీవు ఆత్మోర్ధణను గూర్చి ఆలోచించు.
ఇతరులకై ఎలా విచారపడెదవు
ఎవరైనను నిలిచియున్నను, సాగిపోవుచున్నను
అతనిఆయువు క్షీణించుచునే యుండును

ఈ లోకమునందు ఏప్రాణి అయినను  
జననమరణములను తప్పించుకోజాలరు 
మరణించిన వారికై శోకించేవారు
ఎంత కాలము ఉంటారు ఎవరు తెలుపగలరు?

ఓ భరతా! పుణ్యాత్ముడైన ఆ మహారాజు 
పదునాలుగు సంవత్సరములకాలము
వనములో నివసింపుమని నన్ను ఆదేశించెను 
నేను తండ్రి ఆజ్ఞప్రకారం ఇచ్చటనే యుండెదను

నాయనా! శత్రుసంహారకా! నా మాట వినుము 
తండ్రిగారి శాసనమును ఉల్లంఘించలేను 
దానిని త్రికరణశుద్ధిగా తలదాల్చెదను 
ఆయన ఆజ్ఞను నీవు గూడా పాటింపుము

ఓ భరతా! తండ్రి వాక్కును దృష్టిలో పెట్టుకొని 
రాజ్యభారమును వహింపుము"
భరతునకి తండ్రి ఆజ్ఞ పాటించమని 
శ్రీరాముడు తమ్మునికి దెలిపి మౌనము పాటించెను. 

====================================
అయోధ్య కాండమందు105వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు