107వ సర్గ (2): - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


భరతా! ఆయన ఆజ్ఞతో బద్దుడనై
నేను సీతాలక్ష్మణ సహితుడనై 
ఈ నిర్ణయమునకు వచ్చితిని 
ఈ విషయమున నేను ఎవరి మాటను వినను 

ఓ భరత నా మాటను పాటించి 
కైకేయిదేవి రుణము నుండి తండ్రికి విముక్తిని కలిగించు
ఆయనకు నరక ప్రాప్తి లేకుండ చేయము 
ఇట్లు జేసి తల్లిని గూడా సంతోష పెట్టు. 

వీరుడవైనా ఓ భరతా! శత్రఘ్నునితో గూడి
ద్విజులు మున్నగువారితో అయోధ్యకు వెళ్ళుము 
కోసలదేశ ప్రజలను కన్నబిడ్డలవలె గాంచి
ప్రజలు మెచ్చేరాజ్యపాలన జేయుము. 

ఓ భరతా! నీవు ప్రజలకు ప్రభువు గమ్ము
నేను  సమస్తవన్యమృగములకు రాజునవుతాను 
నీవు ఇప్పుడే అయోధ్యకు వెళ్ళుము 
నేను దండకారణ్యములో అడుగిడుదును. 

ఓ భరతా! బుద్ధిమంతుడైన శత్రఘ్నుడు
ఎల్లవేళలా నీకు తోడుగా యుండును 
సుమిత్ర సుతుడైన లక్ష్మణుడు నాకు తోడు
భరతా ఇక నీవు దుఃఖింపకుము. 

================================
అయోధ్యకాండమందు 107 వ సర్గ సమాప్తము.🙏🏻
కామెంట్‌లు