ఓ మగువా : - కేశరాజు వేంకట ప్రభాకర్ రావు, హైదరాబాద్ . సెల్ ఫోన్ 62816 979 82


మగువా ఓ మగువా!
సృష్టికి ఆది వసంతం నువ్వే!
సహనానికి నిలువెత్తు రూపం నువ్వే
బంధాల నడిబొడ్డున దీపానివి!!

బాధ్యతల పద్మవ్యూహంలో గెలుపువి.
కన్నీటిని దాచే చిరునవ్వువు
కష్టాలను ఓర్చే ధైర్యానివి
నడిపించే నీ అడుగుల వెనుక
నవసమాజపు పునాది ఉంది !!

కూతురిగా ఇల్లాలుగా అమ్మగా
అన్ని రూపాల్లోనూ అమృతంగా మారి
నిలుపుతావు సంసార నౌకను
నీ గుండె నిబ్బరమే దానికి చుక్కాని!!

త్యాగంలోనే ఉంది నీ వైభవం
అనురాగంలోనే ఉంది నీ వైశాల్యం
నువ్వు లేని ఇల్లు చీకటి కుహరం
నువ్వు ఉన్న చోటే స్వర్గద్వారం!!

సహనానికే సవాలు విసురుతావు
ప్రేమతోనే జగత్తును గెలుస్తావు
మగువా నీ మనోహర వ్యక్తిత్వం
ఈ సృష్టికి లభించిన ఒక వరం!!
కామెంట్‌లు