తనకు దుస్వప్నమురాగా భరతుడు చింతాక్రాంతుడగుట
కేకయరాజు నగరమున ప్రవేశించిరి
అదే రాత్రి భరతుడు దూస్వప్నమును గాంచెను
వేకువజామున వచ్చిన కలగూర్చి బీతిచెందెను
చిన్నబోయి యున్న భరతుని మిత్రులు చూసి
ఓ మిత్రమా! మేమంతా నీ చుట్టున్నా గాని
నీవు సంతోషించుటలేదు ఎందుకని?
ఓ మిత్రమా! నాకు దుస్వప్నము వచ్చినది
కలలో మా తండ్రి గిరిశిఖరము నుండి
కలిషితమైన గోమయముతో గూడియున్న
మడుగులో పడుచుండుట చూచితిని
ఆవు పేడలో కప్ప వలె ఈదులాడుచుండెను
వేకువ జామున భయంకరమైన కలగంటిని
దీని ఫలితముగా నేనో, రాముడో,మహారాజో,
లక్ష్మణుడో మరణించుట తథ్యము
ఆ కారణముగా కృశించిపోవుచున్నాను.
నాపై నాకే రోత కలుగుచున్నది
అందులకు హితువేమో తెలియకున్నది
స్వప్నమున జూచిన దుఃఖస్థితిని తలచుకొనగా
నా హృదయము నుండి భయము తొలుగుటలేదు.
==========================================
అయోధ్యకాండము నందు 69వ స్వర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి