అంశము: వర్ణన
వర్ణనాంశము : విమాన ప్రయాణం
ఛందస్సు : చంపకమాల
గగనపు సీమలో చెలగి కమ్మిన మబ్బుల దాటి జోరుగా
నెగసి విహంగ మై క్షణిక మేమరకన్ తన కక్ష్య లోపలన్
సుగమ ప్రయాణ మున్ జరిపి సూటిగ గమ్యము జేర్చు హేతువై
జగతికి “రైటు” సోదరులొసంగిన కానుక యద్భుతమ్మిలన్
“రైటు” సోదరుల = Orville and Wilbur Wright
విమానమును కనుగొన్న అమెరికా అన్న దమ్ములు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి