****************************************************
మా క్లాసులో వంశీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. వంశీకి తెలివితేటలు చాలా ఎక్కువ, కానీ వాడు దాన్ని అల్లరి పనులకే వాడేవాడు. టీచర్లు పాఠాలు చెబుతుంటే వినకుండా వెనక కూర్చుని కాగితం విమానాలు చేయడం, పక్కవారిని ఏడిపించడం వాడికి అలవాటు. టీచర్లు తిట్టినా, క్లాసు బయట నిలబెట్టినా వాడిలో మార్పు వచ్చేది కాదు.ఈ టీచర్లు ఎప్పుడూ ఇంతే, మనల్ని చదవమని విసిగిస్తుంటారు అని మాతో అనేవాడు. ఒకరోజు మా బడికి ప్రసాద్ సార్ అనే కొత్త మాస్టారు వచ్చారు. ఆయన చాలా శాంతంగా
ఉండేవారు. అందరు టీచర్లు వంశీ గురించి ఆయనకు ఫిర్యాదు చేశారు. సార్, ఆ వంశీని మార్చడం ఎవరి వల్ల కాదు, వాడు వట్టి మొద్దు అని చెప్పారు. కానీ ప్రసాద్ సార్ మాత్రం నవ్వి, ఏ రాయిని అయినా శిల్పంగా మార్చవచ్చు, సరైన ఉలి దెబ్బ పడాలి అంతే అన్నారు.
ఒకరోజు క్లాసులో ప్రసాద్ సార్ ఒక చిన్న ప్రయోగం చేశారు. అందరికీ ఒక తెల్లటి కాగితం ఇచ్చి, దాని మధ్యలో ఒక నల్లటి చుక్క పెట్టారు. పిల్లలు! మీకు ఈ కాగితంలో ఏం కనిపిస్తోంది? అని అడిగారు. మేమందరం నల్లటి చుక్క కనిపిస్తోంది సార్ అని అరిచాము. అప్పుడు సార్ వంశీని పిలిచి, వంశీ! నీకేం కనిపిస్తోంది? అని అడిగారు. వంశీ ఎగతాళిగా “నాకు కూడా ఆ నల్ల చుక్కే కనిపిస్తోంది సార్ అన్నాడు. సార్ మెల్లగా నవ్వి, చూశారా పిల్లలు! మీ అందరికీ ఆ చిన్న నల్ల చుక్కే కనిపిస్తోంది కానీ, దాని చుట్టూ ఉన్న ఇంత తెల్లటి కాగితం ఎవరికీ కనిపించడం లేదు. అలాగే మీలో కూడా చిన్న చిన్న తప్పులు ఉండవచ్చు, కానీ మీలో ఉన్న మంచిని గుర్తించడమే గురువు పని అన్నారు. ఆ మాటలు వంశీ మనసును తాకాయి. మొదటిసారి ఒక టీచర్ తనలోని తప్పును కాకుండా, తనలో మంచి ఉందని చెప్పడం వాడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ రోజు నుండి సార్ వంశీకి దగ్గరయ్యారు. వంశీకి లెక్కలు రాకపోతే సాయంత్రం దాకా ఉండి మరీ నేర్పించేవారు. సార్ చూపిస్తున్న ఆదరణ చూసి వంశీకి తన అల్లరి పనుల మీద అసహ్యం వేసింది.
సంవత్సరం గడిచింది. వార్షిక పరీక్షల ఫలితాలు వచ్చాయి. అందరూ ఆశ్చర్యపోయేలా వంశీ స్కూల్ టాపర్‌గా నిలిచాడు! వంశీ స్టేజి మీదకు వెళ్లి మెడల్ తీసుకుంటుంటే అందరూ చప్పట్లు కొట్టారు. మైక్ పట్టుకున్న వంశీ ఇలా అన్నాడు. నిజానికి ఈ మెడల్ నాకు కాదు, మా ప్రసాద్ సార్‌ది. నేను దారి తప్పి చీకట్లో ఉన్నప్పుడు, సార్ ఒక దీపంలా వచ్చి నాకు దారి చూపించారు. గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, మనలోని మనిషిని నిద్రలేపే దైవం. అప్పుడు వంశీ సార్ దగ్గరకు వెళ్లి ఆయన పాదాలకు నమస్కారం చేశాడు. సార్ కళ్లలో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆ రోజు మా అందరికీ అర్థమైంది గురువులను గౌరవించడం అంటే కేవలం వినయంగా ఉండటం కాదు, వారు చెప్పే మాటలను జీవితంలో పాటించడమే అసలైన గౌరవం అని.
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే, గురువులు మనకు జీవన మార్గాన్ని చూపిస్తారు. ఏ విద్యార్థి అయితే తన గురువును గౌరవించి, వారి అడుగుజాడల్లో నడుస్తాడో వాడు ఖచ్చితంగా గొప్ప స్థాయికి చేరుకుంటాడు.
నీతి: గురువు ఆజ్ఞ - శిష్యుడికి రక్ష. గురువును గౌరవించేవాడు లోకాన్ని జయించగలడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి