81వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
 వసిష్ట మహర్షి భరతశత్రఘ్నులు సభా భవనమునకు విచ్చేయుట 


శ్రీరాముని గొనివచ్చుటకు సుప్రభాత వేళ 
భరతునకై మంగళ స్తోత్రంలను స్తుతించిరి
వందల కొలది శంఖములను పూరించిరి 
మధుర గానములను గావించిరి

అచట దుఃఖతుడై యున్న భరతుడు 
ఆ ధ్వనులను విని ఇంకా కృంగిపోయెను 
నేను రాజును కాను అని పలుకుచు
ఆ ధ్వనులను నిలిపివేయించును

శత్రఘ్నునితో భరతుడు ఇలా అంటాడు 
"ఓ శత్రఘ్నా! కైకేయి ఈ లోకమునకు 
ఎంత అపకారము చేసినది చూడుము
దశరథ రాజ్యలక్ష్మి దిక్కులేని దైనది 

భరతుడిట్లు విలపించుచున్న సమయమును 
వసిష్టడు రాజభవనమునకు ప్రవేశించెను 
మహర్షి బంగారు పీఠముపై ఆసీనుడాయెను
అతడు దూతలకు ఇట్లు ఆజ్ఞలనిచ్చెను.
 
మంత్రులను పురోహితులను ప్రజలను 
అందరిని ఈ సభకు ఆహ్వానించుడు 
ఆ సభకు అందరూ వేతెంచినారు 
పూర్వపు దశరథుని సభవలె రాజల్లుచుండెను.

================================
అయోధ్యకాండ మందు 81వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు