84వ సర్గ : ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
గుహుడు భరతునిరాకలోని ఆంతర్యము తెలియక 
యుద్ధసన్నద్ధులై యుండుడు అని తన వారిని ఆదేశించుట 
---------------------



భరతుని సైన్యము గంగా నదితీరమున
గుహుడుచూసి తన సహచరులతో 
మీరంతా యుద్ధమునకై సిద్ధంగుండుము
భరతుడు సైన్యముతో ఇటు చేరినాడు 

దశరథ మహారాజు యొక్క రాజ్యమును 
ఈ కైకేయిసుతుడు శాశ్వతముగా పొందుటకై 
శ్రీరాముని దాసులమైన మనలను 
తమసేనాబలముతో బంధించుటకొచ్చాడు 

మీరొక్కొక్కనావపైవందమంది చొప్పున 
నవయువకులు సంసిద్ధమై యుండుడు
అతుడు శ్రీరాముని మేలుకోరివచ్చినచో
ఆసేన సురక్షితముగా తీరముదాటగలదు

సుమంత్రుడు గుహుని వద్దకు వచ్చుచుండెను 
గుహుడు అతడిని జూసి ఎదురు వెళ్ళెను
అప్పుడు సుమంత్రుడు అతనితో ఇట్లంటాడు 
ఓగుహా! భరతుని రాముని వద్దకు చేర్చుము 

శ్రీరాముని అయోధ్యకు గొనిపోవుటకై  వచ్చెను 
ఆ మాటలిన్న ఆ గుహుడు  సంతోషించి 
వారికి స్వాగతము పలికి ఇలా అంటాడు
మా ఆతిథ్యము అందుకొని రేపు వెళ్ళుడు.

===========================
అయోధ్యకాండమందు 84వ సర్గము
కామెంట్‌లు