ప్రవాస పద్య పరిమళం - 85: - - వెంకట్ కొత్తూర్ Ashburn VA USA
 అంశము: సమస్య 
సమస్య : “పోదది పోనెపోదికను పొమ్మని దెల్పిన పోదుపోదుగా”
ఛందస్సు:  ఉత్పలమాల



ఉత్పలమాల : 

మేదము నందు శ్రీపతిని మెండుగ దల్చెడి దానవుండు, ప్ర
హ్లాదుడు తండ్రితో నుడువ హాసముతో హరినామ కీర్తనల్ 
క్రోధము తోడ కన్న కొడుకున్ జెరసాలన వేసినన్, హరీ!
పోదది పోనెపోదికను పొమ్మని దెల్పిన పోదుపోదుగా
మేదము = మేదస్సు, మెదడు.
మనస్సులో శ్రీహరిని నిరంతరము తలచే దానవవుడైన ప్రహ్లాదుడు, తండ్రికి హరినామ కీర్తనలను ఆనందముగా వినిపిస్తే, క్రోధముతో కొడుకును చేరసాలలో వేసినా సరే,    హరీ ! నీ  నామ స్మరణ ఎక్కేడికి పోదు., పోదు, … పోదు గాక పోదు అని నిర్ద్వందముగా విన్నవించే సన్నివేశం.
కామెంట్‌లు