ఆ మహారాజుకెంతో అభిలాషయుండేది
అతని కోరిక నెరవేర లేదనే బాధతో ఏడుస్తూ
తన ప్రాణాలనుకోల్పోయి యుండును
ఆ మహారాజు మరణించిన యెడల
భరత శత్రఘ్నులు అచ్చటనే యుండి
అంత్యక్రియ సంస్కారంలను నిర్వహింతురు
నిజముగా వారు ఎంతో ధన్యాత్ములు
ఓ నిషాత రాజా! మా తండ్రి యున్నచో
అయోధ్య నగరవైభవము చెప్పనలవి కాదు
దేవమందిరములు రాజప్రసాదములు
కనువిందు గావించుచుండును.
శ్రీరాముడు వనవాస దీక్షను ముగించుకొని
క్షేమముగా తిరుగు ప్రయాణమున
మేము ఆయనతో గూడి బయలుదేరి
సుఖముగా అయోధ్యకు చేరగలమా?
లక్ష్మణుడు శ్రీరాముని గూర్చి చింతించుచుండగానే
ఆ రాత్రియంతయు గడచిపోయెను
ఉదయము నిద్రలేచి స్నానజపాదులుజేసి
సీతాదేవితో గూడి వారు ముందుకు సాగిరి.
===============================
అయోధ్యకాండమందు 86వ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి