రాజకీయపు జూదంలో మోసపు టెత్తులు
ఉచితాలమాటున పొంచియున్న అనర్ధాలు
సామాన్య ప్రజలకివి అర్థం కాని సుడోకోలు
ప్రజలను పరాన్నజీవులుగా మార్చే సాలెగూళ్ళు
ఉచితాలు కావెన్నడు స్వయం సమృద్ధి పథకాలు
నైపుణ్యపు తల్లివేళ్ళను పెకలించు పన్నాగాలు
పూర్తిగా మేధస్సును మొద్దుపరిచే ప్రణాళికలు
వెనిజులా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసెనుగ ఉచితాలు
అది చూసైనా తెలుసుకోవాలనుకోరు మన ప్రజలు
యువశక్తే మన దేశానికి తరగని సిరిసంపదలు
సద్వినియోగ పరచుకుంటే మనకు కలుగునెంతో మేలు
శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు వెచ్చించాలి అధిక నిధులు
విధానాల రూపకల్పనలో రావాలి సమూలమైన మార్పులు
సంక్షేమ పథకాల ఎంపికలో వహించాలి తగు జాగ్రత్తలు
అవేగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే బాటలు
విద్యావ్యవస్థలో చేపట్టాలి ప్రగతిశీలవంత విధానాలు
మేధస్సుకు ఇవ్వాలి ప్రాముఖ్యత, అండదండలు
సంఘటిత కృషి మనదైతే అభివృద్ధికి ఉండవు ఏ అడ్డంకులు
అప్పుడు మన దేశం అందుకుంటుంది ప్రపంచ దేశాల నీరాజనాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి