దాంపత్యం : - - యేచన్ చంద్ర శేఖర్-✆ 8885050822
మూడు ముడుల బంధం !
ఆలుమగల అనుబంధం !!



ఇరువురి అన్యోన్య దాంపత్యం ! 
సిరులొలికే సత్సంతానం !!

ఇరు తనువుల సంగమం !
కలిగించు జీవన సాఫల్యం !!

అరమరికలు లేని అనురాగం ! 
సాగిపోయే కడలి తరంగం !!  

పట్టింపులకు పోతే ఖేదం !
సర్దుకు పోతే మోదం !!

ఇది గొప్ప తారక మంత్రం  !
ఆచరిస్తే అనునిత్యం ఆనందం !! 

విస్మరిస్తే తప్పదు విచ్ఛిన్నం !
అది గుర్తిస్తే కలుగు జయం !! 

బోధించడం తల్లిదండ్రుల కర్తవ్యం !
వారు కావాలి సంతుకు మార్గదర్శనం !!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చక్కని కవిత