విద్యార్థుల్లో హింసోన్మాదం : - - యేచన్ చంద్ర శేఖర్-✆ 8885050822
ఎటు పోతోంది విద్యార్థి లోకం 
ఏమిటి ఈ హింసోన్మాద కారణం ...



గురువుల బోధనారాహిత్యమా  
విద్యావ్యవస్థ లోపభూయిష్టమా ...

సమాజంలోని విశృంఖలత్వమా  
తల్లిదండ్రుల పాలనాలోపమా ...

ఒకనాడు గురువులంటే గౌరవం 
నేడు గురువులంటే తృణభావం ...

నాడు సుశ్రూతలు చేసెడి విద్యార్థులు
నేడు కడతేర్చుటకు వెనుకాడని బాలలు ... 

ఇదేనా మన భారతీయ సంస్కృతి 
ఎందుకు దాపురించిందీ దుస్థితి ....

ఎందుకు యువతలో ఈ వికృత పోకడలు
ఎలా అబ్బుతున్నాయి ఈ దుర్లక్షణాలు ...     

ఈ విష సంస్కృతికి ఇవ్వాలి తిలోదకాలు 
విద్యార్ధుల్లో నాటాలి సంస్కారపు బీజాలు ...  

కామెంట్‌లు