భరద్వాజుడు దివ్యమైన పదార్థములతో ఆతిథ్యము నొసంగుట
భరతునకు అతని సపరివారమునకు
అతిథి మర్యాదలను జేస్తూ ఇలా అంటాడు
ఓ భరతా! మా ఆతిథ్యము స్వీకరింపుము
ఓ నరోత్తమా! నీ పరివారమును
నదితీరమున యుంచివస్తివి ఎందుకని?
ఓమహార్షి నీఆశ్రమమున భంగంకలుగుననీ
భయముతో వారినచ్చటనే యుంచితిని
ఓ భరతా! నీ సైన్యమును పిలిపించు
నీ అశ్వగజములను ఇటు తెప్పించుమని
ఆ ముని! అతిథిసత్కారములను జేయుటకై
మహర్షి విశ్వకర్మను ఆహ్వానించెను
భరతాదులకాతిథ్యమునియ్యదలిచితిని
అందులకై ఇంద్ర, యమ, వరుణ కుబేరులను
పిలుస్తున్నాను వారునాకుతోడుగా యుందురు
నదులన్నీటిని ఆహ్వానిస్తున్నాను.
భరద్వాజమహర్షి అంజలిఘటించి
తన మనసులో దేవతలను ధ్యానింపగా
ఆచటికి అందరు దేవతలు విచ్చేసినారు
వారికై మధురమైన వీణగానములను వినిపించినారు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి