భరతుని సపరివారమంతయు అందులోకి వెళ్లారు
అశ్వగజములకు భవంతులు నిర్మించారు
భరతుడు చూసి ఎంతో సంతోషించాడు
భరద్వాజ మహర్షి అలా ఏర్పాట్లు చేసి
పండ్లు ఫలాల భోజనములతో
ఖర్జూరపానీయములతో సంతృప్తి పరిచి
అందరిని అతిథి సత్కారముతో గౌరవించెను
ఆ మహర్షి ఆశ్రమము వద్ద ఎంతో సందడి
ఎటు చూసినా గాని పుష్ప ఫలములతో
అందమైన వృక్షములతో యుండెను
వారంతా అతిథి సత్కారము పొందినారు.
రాత్రి దేవతలంతా క్రీడా విహారముతో గడిపిరి
నదులు,గందర్వజాతివారు, అప్సరసలు
భరద్వాజమహర్షి అనుమతి పొంది
తమ తమ ప్రదేశములకు వెళ్లిపోయిరి
మత్తు పానీయములు సేవించిన వారు
తెల్లవారేసరికి మత్తు విడక యుండిరి
వారు మత్తులో అటూ ఇటూ బోర్లుట వలన
వారుధరించిన మాలికలు చెల్లాచెదురై పడెను.
------------------------------------------------------------
అయోధ్యకాండమందు 91టవ సర్గ సమాప్తము🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి