శ్రీరాముడు వనములకు చేరుటవలన
దేవతలకు, దానవులకు, మహార్షులకు
ఈ జగత్తునకుగూడా హితవుజరుగును.
భరతుడు ఆ మహర్షి ఆశీస్సులను పొంది
తన పరివారముతో బయలుదేరుతాడు
వివిధ మార్గములలో ప్రయాణించుటకు
బంగారు రథములను అధిరోహించి
శుభలక్షణ సంపన్నుడైన భరతుడు
వసిష్ఠాధి మహర్షుల అమోదముతో
శ్రీరాముని దర్శించాలనే కోరికతో
ఉదయసూర్యకాంతలతో విలసిల్లుచున్న
బంగారుపల్లకి నెక్కి వెళ్ళు చుండెను
గజాయుధములతో అశ్వసమూహముతో
వరుసలు తీరియున్న రథములతో
దట్టమైన మేఘములవలె దక్షిణదిశన గదిలిరి
గంగానది యొక్క పశ్చిమ భాగమున
నదితీరప్రదేమున మధ్యమధ్య ఆగుతూ
గజాశ్వయోధులతో గూడిన భరతునిసేన
వేగముగా దట్టమైనఅడవిలో ప్రవేశించెను.
=========================
అయోధ్యకాండ నందు 92 వ సర్గ సమాప్తము 🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి