దక్షిణతీరముననుసరించి వెళ్లినచో
అచట రెండు త్రోవలు కనిపించును
ఆ రెండు దారులలోఎడమవైపున
దక్షిణ దిశగా నైరుతి మార్గమునుండి
నీ చతురంగబలములను నడిపించు
శ్రీరాముని దర్శనము శీఘ్రముగా కలుగును
భరతా దశరథపత్నుల గూర్చి తెలుపుము
ఓమునివరా! రామజనని శోకమున యుండెను
సుమిత్రాదేవి దీనురాలైయుండెను
కైకేయి నా తల్లి మిక్కిలి దుర్మార్గురాలు
ఈమెవల్లనే శ్రీరాముడు వనములకెళ్ళెను
క్రూరాత్మరాలు పాపబుద్ధిగలరాక్షసి
జేష్ట పుత్రుని అడవిపాలు చేసినది
ఈమెవల్లనే మాతండ్రి మరణించినాడు
తల్లిని కఠినమైనమాటలతో నిందించెను
ఓ భరత! నీవు కైకేయిని తప్పుపట్టవద్దు
ఆమె దోషము ఏమియు లేదు పుత్రా
శ్రీరామునివనవాసము భవిష్యత్తులో
ఎల్లరకు సుఖశాంతులను ప్రసాదించును.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి