తనయుల ప్రభ.:- డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,-94410 58797.


 

(ఆగస్టు 1, నుండి తల్లిపాల వారోత్సవాలు)

2259.

తల్లిపాలు అమృతము,
 జగాన అన్యత్ర దుర్లభము!

శ్రీరాముని ధర్మనిరతి,
 కౌసల్యక్షీర ప్రభావము!

శ్రీకృష్ణ చురుకు యశోదమ్మ, 
పాలు త్రావిన వైనము!

శివాజీ శౌర్యము,
  జిజియా బాయిచ్చిన,
                    క్షీరసారము!

పుత్లీబాయి పాలిచ్చిన పుణ్యం,
మనిషి మహాత్ముడయ్యే, పివిఎల్! 

2260.

శిశువుకి పాలివ్వడం ,
   మాతృత్వస్ఫూర్తి,
              దివ్యానుభూతి!

శిశువు అమ్మపాలు తాగడం,
          సరి ఆరోగ్య నిర్మితి!

తల్లి బిడ్డల సంబంధం,
 దృఢమౌ తల్లిపాలే సుగతి! 

తల్లిపాల వారోత్సవాలు,
 నిర్వహణ నేటి సంస్కృతి! 

ఆ వారమే తల్లులు పాలిస్తే ,
మాతృత్వాన అపశృతి,
పివిఎల్! 
_________

కామెంట్‌లు