అక్షరామృతం.: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం,-94410 58797.

 

నా పంచపదుల సంఖ్య-----
       2269-2273.

2269.

బంకించంద్ర హృదయ,
 ఆవిర్భావ దేశభక్తి స్తోత్రము! 
అక్షరాల అనన్య అద్భుత,
 జాతి చైతన్య సూత్రము! 
భారతి గళాన అలరించె,
 అక్షర పారిజాతము! 
అమరగీతం, మధురభావం,
  హృదయాల నిక్షిప్తము! 
వందేమాతరం కలకాలం,
 భారతీయ వారసత్వము, పివిఎల్!

2270.

అక్షరఅగ్నికణాలే ,
దేశభక్తి జ్వాలాకారకాలు!
పదాలు, మంత్రాలే ,
    స్వాతంత్రోపాసన 
               దివ్య ప్రేరకాలు!
కేంద్రీయ భావం ప్రాకృతిక ,
నిజ సౌందర్య వీక్షణాలు!
సరి సంగమం, సంస్కృత, 
 బెంగాలీ భాషల సోయగాలు! 
తెల్లవాడి గుండెల, అక్షర, 
 వజ్రాయుధ ప్రహారాలు, పివిఎల్!

2271.

ఆధ్యాత్మికవేత్తలు-
      సాక్షాత్తు ఋషి వాక్యమే! 
ఉద్యమకారులంతా--
      పోరాట స్ఫూర్తి కేంద్రమే! 
అవమాన గాయాన ,
        పుట్టే, ఆత్మ ప్రబోధమే!
అమ్మా అన్న పిలుపు,
          రంగరించిన కావ్యమే!
స్వాతంత్ర సమర ,
పూరించిన పాంచజన్యమే, 
 పివిఎల్!

2272.

నాడు దీర్ఘగీతం ,
నేడు సంక్షిప్త సుందరము!
ఏనాడు జన జాగృత,
       చైతన్య సంచారము!
అక్షరామృతాన ,
మన బతుకు శాశ్వతము! 
నూటయాభై ఏళ్లుగా 
      చిరాయువైన గీతము!
ఆ గీతం ఊత,
  మనగమనం ,
    పురోగమనం, పివిఎల్!

2273.
నిత్యం అనాలి వినాలి,
        అర్థమూ తెలియాలి!
దేశభక్తి గంగాజలం ,
         మునకలు వేయాలి! 
మనమే భరతమాత,
         అండగా నిలవాలి!
ప్రతి స్వాతంత్ర దినం,
      పునరావృతం కావాలి! 
ఈ దినం ఎర్రకోట వినిన,   
    వందేమాతరం, పివిఎల్! 
_________

కామెంట్‌లు