నాడు వారధి కట్టడాన,సాయం ఓ ఉడత!నేడు కదల లేని వానికి ,సాయం ఈ బుడత!ప్రయత్నంలో ప్రదర్శించే,ఏమా ఉత్సుకత!చిరుప్రాయాన చేస్తున్న,స్వచ్ఛంద ప్రయత్నశీలత!భావి ,సేవా దృక్పథం,సదా వర్ధనీయత!పిల్లలుస్వచ్ఛతాస్వరూపాలు !తీర్చిదిద్ద,మానవతా ప్రతిరూపాలు!విలువలు లక్ష్యంగా,పెరిగితే మహనీయులు !భావి భారత పౌరులు,భరతమాత యశోతేజాలు!వారే ఆసరా, వారే భరోసా,జీవనం కులాసా!ప్రతివాడు తనకు,తానే గుడ్డెద్దులా పోవడమే!పక్కనున్న వాడిపై,రవ్వంత దృష్టి పెట్టకపోవడమే!ముందు ,వెనక , ఎవరైనాపడి ఉన్నా , వదిలేయడమే!నేలనున్నది నెత్తికి ,ఎందుకనే స్వార్థ ఆలోచనే!సర్వత్రా ఒంటి పిల్లి రాకాసి,జీవన విధానమే!పెద్దలు పిల్లలు కాలేరు,పిన్నలే పెద్దలు అవుతారు!చిన్నవాడిగా చేసే సాయం,పెద్దయ్యాక తరణోపాయం!నీవు చేయి అందిస్తే దైవం ,నీ చేతిని అందుకుంటాడు!నేడు నీవు నాటే సేవా విత్తు,రేపు చూపు మహత్తు!ఈ చిన్నవాడి కసరత్తు,మంచికి వీడని పొత్తు!మనం వీలు చేసుకుని ,సాయం చేస్తూ ఉండాలి!గుడ్డివాడు ఎదురైతే,చేయిపట్టి నడిపించాలి!కుంటివాడు చతికలబడితే,తోడుగా నిలబడాలి!ఆకలి గొన్నవాడికి,పట్టెడన్నం తినిపించాలి!దీన జన సేవ మానవ జన్మ,,మరి తరించే సరిత్రోవ!_________

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి