భారత్ కి జాన్ జవాన్!: - డా పివిఎల్ సుబ్బారావు, -విజయనగరం, 94410 58797.


 

మేరా భారత్ మహాన్! 
జవాన్ ,ఉస్కా ఈమాన్!
దేశ రక్షణ, శ్రద్దావాన్!
పోరాటాల ,కర్తవ్యమాన్!
దేశ్ కా మాన్, ఉస్కీ జాన్!

శౌర్యం పాలిచ్చి,
            పెంచిన, జనని !
సుజలాం, సుఫలాం,
         పోషించిన ధరణి !
వారి ఇద్దరికీ అతడే,
             కొండంత అండ! 
పెరిగి పెద్దయిన,
     తన బంగారు కొండ!
చల్లగుండ అంటుంది,
           ఆ తల్లి గుండె! 

 తల్లి కంట ఆనంద,
 బాష్పాల ఆగని వాగు! 
కన్న పేగు  దేశ రక్షణకై ,
ముందుకు సాగు!
ఇంతకన్నా ఏమున్నది ,
ఆ తల్లికి జీవితాన బాగు!
తన్ను తాను ఓదార్చుకునే,
 ఆ తల్లి ఖామోష్!
కంట నీరు తుడుస్తున్న,
  ఆ తనయుడు సహబాష్!

వీరమాత, వీరపుత్రునికి, 
  ఆశీర్వచనం! 
పోరాటాల అది,
 స్వీయ రక్షణ కవచం! 
విజయం వరించిందా,
 మన దేశం భద్రం! 
అపజయం సంభవించిందా, 
అతనికి వీర స్వర్గం సిద్ధం! 
ఏదైనా యోధ ధర్మం, 
నిధనమపి శ్రేయవహ!

ప్యారా వతన్,
       జీవన్ సమర్పణ్!
యువత భుజాలపై,
               దేశ భవిత! 
సిపాయిలుగా ,
        సదా సంసిద్ధత! 
ఎట్టి పరిస్థితులలో ,
     సడలని సమర్ధత! 
యశోవర్ధనీయత,
                  జీవన సార్ధకత! 
__________

కామెంట్‌లు