అచ్చులతో అంతమయ్యే
అజంతా భాష మన తెలుగు..
అత్యంత ప్రాచీన భాష తెలుగు.
అలనాడు శాస్త్రీయ భాషగా గుర్తింపు పొందింది తెలుగు..
కమ్మనైన భాష..
కవులు మెచ్చిన భాష..
కందమూలం వంటి భాష..
కంద పద్యం కల భాష..
వర్ణమాల భాష..
వర్ణించతరమా మన భాష..
సువర్ణము వంటి భాష..
సవర్ణదీర్ఘ సంధి కల భాష
సుందరమైన భాష..
వ్యంజనములున్న భాష..
వ్యాకరణం కల భాష..
విభక్తిప్రత్యయాలున్న భాష..
విభిన్నమైన భాష..
భాషాభాగాలు గల భాష
భావయుక్తమైన భాష..
భేషైన భాష..
భేషజాలు చూపని భాష..
భారత రాజ్యాంగం గుర్తించిన భాష..
ఉత్పలమాల చంపకమాలలు,
ఉన్నటువంటి ఉత్తమమైన భాష..
శార్దూలము మత్తేభములున్న,..
పద్య శాఖలు గల ప్రత్యేక భాష
తేటగీతి, ఆటవెలది కల
తేనెలూరు తియ్యనైన భాష..
గణములు, గుణములున్న భాష..
అగ్రగణ్యమైన భాష, మన తెలుగు భాష..
భాషలందు భాగ్యమైన భాష..
భావి తరాలకు బోధించు భాష..
మన తెలుగు భాష..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి