అంతర్జాతీయ గణిత దినోత్సవం :-మడ్డు తిరుపతి రావు-గణిత అవధాని & టీచరు -బూరగాం* కంచిలి* శ్రీకాకుళం*-9491326473

 

 ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఎబీలియన్ జన్మదినం సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ గణిత దినోత్సవం శుభాకాంక్షలు తెలియ జేస్తూన్నాను.
గణిత శాస్త్రములో అతి ముఖ్యమైనవి అంకెలు మరియు గుర్తులు.
+, -, ×, ÷ 
మిత్రులను ఎల్లప్పుడూ కలుపుకుంటూ (+) పోవాలి.
శత్రువులను,మన నుండి దూరం చేస్తూ(–) పోవాలి.
ఆనందంను,సంతోషంను అందరితో హెచ్చవేస్తూ(×) పోవాలి.
బాధలను,కష్టాలను (÷) అందరితో  పంచుకునేలా ఉండాలి
1,2,3,4,5,6,7,8,9, మరియు0 తో తమాషాలు
1)0 నుంచి 9 వరకు అన్ని  అంకెలను ఉపయోగించి వాటి విలువ 1 తేవాలి?
జవాబు: 
1) 135/270 +48/96
   =>1/2+1/2=1
2)35/70+148/296
  => 1/2+1/2=1
3)(123456789)⁰=1.
2) 1 నుంచి 9వరకు అన్ని అంకెలను వరుసగా ఉపయోగించి వాటి విలువ 100 వచ్చేటట్లు చేయడం ఎలా?
=> 123-45-67+89=100 మరియు
=>1+2+3-4+5+6+78+9=100
3) 12 గంటలు,34 నిమిషాలు,56 సెకనులు, 7వ తేది,8వ నెల,90 వ సంవత్సరం.. ఈ తేది లో ఉన్న గణిత చమత్కారం ఏమిటి?
జవాబు: 1,2,3,4,5,6,7,8,9,0 , మొదలగు అంకెలు వరుస క్రమములో ఉన్నాయి.

కామెంట్‌లు