అమరవీరుడు తాంతియా టోపే : - గుర్రాల లక్ష్మారెడ్డి ,సహస్ర కవి రచయిత, కల్వకుర్తి -సెల్ :9491387977.
 

యేలా అను గ్రామంలో పాండురంగారావు తోపే రుక్మాబాయి అను దంపతులు నివసిస్తుండేవారు. భర్త రెండవ భాజీరావు కొలువులో ఉద్యోగం చేస్తుండేవాడు. భార్య ఇంటిలోనే ఇరుగుపొరుగు వారి బట్టలు కుట్టించి భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అంతేగాక ఆమె కృష్ణ భక్తురాలు. దైవం మీద అపారమైన భక్తి కలిగి ఉండేది. ప్రతిరోజు తన దైనందిక కార్యకలాపాల అనంతరం కృష్ణ భగవానుని పూజించేది. అలానే ఒకరోజు పూజ గదిలో కృష్ణా పూజ చేస్తూ తన మనసులో ఓ వీరోచిత పుత్రుడు ఉంటే తన జన్మ ధన్యమవుతుందని అనుకొని కృష్ణ భగవానుని మెడలో తాను అల్లిన పూలహారం వేసింది. ఆ పూల హారం నుండి ఓ పువ్వు రాలి ఆమె ఒడిలో పడింది. అది గమనించిన రుక్మాబాయి నా కోరికను కృష్ణుడు ఆలకించాడని, తన ఒడిలో పడిన పువ్వు అందుకు సంకేతమని అనుకుంది. తనలోనే తాను సంతోషిస్తున్న ఆమె భర్త తన భార్యను చూసి
  "ఏం రుక్మా ! నీ కళ్ళలో అంతులేని ఆనందం తాండవిస్తుంది. ఏంటి కారణం?
అంటూ ప్రశ్నించాడు"పువ్వు తన ఒడిలో పడిన సంగతి భర్తకు చెప్పడంతో " తప్పక ఆ శ్రీకృష్ణ భగవానుడు నీ మనసులోని కోరికను తప్పక తీరుస్తాడులే "అంటూ ఆమెను ఆటపట్టించాడు.
ఆమె మనసులోని కోరికను ఆ శ్రీకృష్ణ భగవానుడు రెండు సంవత్సరాల తర్వాత తీర్చాడు. ఫలితం అందమైన అబ్బాయి పుట్టాడు. అతనికి ముద్దుగా వీరూ అని పిలుచుకునేది.
తన భర్తకు ఉద్యోగం ఇచ్చిన యజమాని రెండవ బాజీరావు
యేలా పట్టణాన్ని వదలి బీరూర్
పోతుంటే ఆ దంపతులు కూడా తమ కుమారుడితో బాటు బీరూర్ వెళ్లారు. అక్కడనే రుక్మాబాయి కుమారుడు వీరూ పెరిగి పెద్దవాడయ్యాడు.
బీరూరులో పీష్వా దత్తపుత్రుడైన నానా సాహెబ్ తో వీరూకు స్నేహం కుదిరింది.
ఒకరోజు వీరూ నానా సాహెబ్ ఇద్దరు కలిసి తోటలో విహరిస్తుండగా వారి వెనుక వైపు నుండి ఓ పులి గాండ్రిస్తున్న శబ్దం వచ్చింది. వెంటనే నానా సాహెబ్ వెనకకు తిరిగి చూడకుండానే తన బాణం ప్రయోగించి ఆ పులిని చంపాడు. అది చూసి వీరూ ఆశ్చర్యపోయాడు. తాను కూడా బాణ విద్యను నేర్చుకోవాలన్న తలంపుతో "మిత్రమా! నాకు కూడా ఈ బాణ విద్యను నేర్పవా"? అని అడగగా  "ఈ బాల విద్యే కాదు , నీవు నేర్చుకుంటానంటే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, మల్ల యుద్ధం అన్ని నేర్పుతా"అన్నాడు నానా సాహెబ్. అలా అన్ని విద్యలు నానాసాహెబ్ వద్ద శిక్షణ పొంది నేర్చుకున్నాడు వీరూ.
ఇలా ఉండగా బ్రిటిష్ సైన్యం ఎన్నాళ్లుగానో నానాసాహెబ్ ను ఎలాగైనా వశపరచుకుంటే, ఝాన్సీ లక్ష్మీబాయి కూడా వర్షపరచుకోవచ్చు అన్న వ్యూహంతో కాన్పూర్ పై దండుతారు. ఈ విషయం తెలుసుకున్న వీరూ వెంటనే కాన్పూర్ వెళ్లి అక్కడ వారి స్థావరాన్ని ముట్టడించి బ్రిటిష్ సైన్యం నానా సాహెబ్ కు లొంగిపోయేలా చేసాడు.
       ఎలాగైనా వీరూను చరబట్టాలని వ్యూహంతో బ్రిటిష్ సైన్యం కల్నన్.హోమ్స్ ఆధ్వర్యంలో జనరల్ రాబర్ట్స్, జనరల్ మిచల్ బ్రిటిష్ దళాలు
అనేక ప్రదేశాలలో వీరూను వెంబడించి 2800 మైళ్ళు దాకా అతనిపై దాడి చేశారు. కానీ ఆ బ్రిటిసైన్యానికి వీరూ చిక్కకుండా
చాకచక్యంగా తప్పించుకున్నాడు.
      బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్న గ్వాలియర్ కోటను తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలన్న తలంపుతో జనరల్ హ్యూరోజ్ తో పోరాడి తిరిగి కోటను స్వాధీనం చేసుకున్నాడు.
     ఇలా ప్రతిసారి భంగపడుతున్న బ్రిటిసైన్యం ఎలాగైనా ఈ వీరూను సంహరించాలన్న తలంపుతో
వీరూ ప్రాణ స్నేహితుడైన నార్వార్ రాజు మాన్సింగ్ను కలిసి నిన్ను గ్వాలియర్ కోటకు రాజును చేస్తామని ఆశ చూపగా, దానికి లొంగిపోయిన మాన్సింగ్ వీరూను పట్టించాడు.
18 ఏప్రిల్, 1959లో వీరూను వారి ఆధీనంలోకి తీసుకొని వారి సైనిక కోర్టులో విచారించి,
మధ్యప్రదేశ్ లోని శివపురి పట్టణంలో ఉరితీశారు.
      ఎన్నో సాహస కార్యాలు చేసి, ఉరి కంభం ఎక్కి అమరుడై చరిత్రలో నిలిచిపోయిన వీరూ ఎవరో కాదు. భావితరాలు మరువకుండా దేశ చరిత్రలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న అమరవీరుడే
మన కథానాయకుడు తాంతియాతోపే..
కామెంట్‌లు