94వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


ఓ సర్వాంగసుందరీ! ఈ వనమునందు 
నీవు చేసే! సహచర్యముల వలనను
లక్ష్మణుడు చేసే సేవల తోడను 
చాలాకాలము ఇచ్చటనే యుండాలని యుంది.

ఓ జానకీ! వనవాసము చేయుట వలన 
తండ్రి ఆజ్ఞ పాటించుట ద్వారా 
పితృఋణము తీర్చుకొనుట కైకపుత్రుడు 
భరతునకు సంతోషము చేకూర్చుటవలన 
రెండు ఫలములు నాకు దక్కినవి.

ఓ రాణీ! మా వంశమున మూలపురుషులైన 
మనువు, మొదలగు రాజమహిర్షులు 
నియమముగా వనవాసము చేసినచో 
అమృతత్వము లభించునని తెలిపిరి.

ఓ సుందరీ! ఈ గిరులయందు చూడగా 
గుహలు సకల సౌకర్యములతో 
నివాస గృహములవలెయుండెను
ఈ శిఖరము మనోహరముగా విరాజిల్లుచున్నది

ఓ ప్రాణేశ్వరీ! శ్రేష్టమైన వనవాస దీక్షను పాటిస్తూ 
సత్పురుషులమార్గమున మెదలుచు
నీతోను,లక్ష్మణునితోను వనదీక్షను ముగించి 
మన వంశకీర్తి ప్రతిష్టలను నిలిపెదను.
======================================
అయోధ్య కాండ మందు 94వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు