మహేంద్రజాలాసుపత్రులు : - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497


కడుపులో స్వల్పమైన 
నొప్పి అంటే
స్టమక్ ఎండోస్కోపీ అంటూ హంగామా 
బ్లడ్ యూరిన్ టెస్టులు
అన్నీ రిపోర్ట్ లు
నార్మల్ అని 
కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా 
జలగల్లా పట్టిపీడించే రక్తం రుచి మరిగిన రాకాసి వైద్యోత్తములు

కార్పోరేట్ ఆసుపత్రుల్లో
నిలువు దోపిడి చేసే
మాయా మాంత్రికులు 

రోగమే కార్పోరేట్ ప్రపంచానికి సౌభాగ్యయోగమై
మూడు పువ్వులు 
ఆరుకాయలుగా సాగే
ప్రిస్క్రిప్షన్ దోపిడీ వ్యవసాయం 
ఔషధాల్లో దోపిడీ మంత్రం 
అడుగడుగునా దోపిడీ సూత్రం
 వల్లె వేయడం 

మధ్యతరగతి పేదప్రజలను
దివాళా తీయించు
దళారీ వ్యాపార కేంద్రాలు

వైద్యంనాణ్యత దేవుడికెరుక
మత్తులో రోగి నుంచి
విలువైన అవయవాలు మాయం చేయు ఇంకొన్ని 
మహేంద్రజాలాసుపత్రులు
తస్మాత్ జాగ్రత్త 
సోయితోలేకుంటే గయాబ్ చేస్తారు 
కిడ్నీలు
హూషార్ రహో 
నహీహైతో సోబ్ లూఠీ కర్ తా

కామెంట్‌లు