పోకిరీలందరూ మానవ బాంబులే: - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497



(విలువలు లేని విద్య )
చదువు కాలక్షేపమై
వ్యసనమే నిత్యకృత్యమై
అబద్ధాలే వారి కోర్కెలు తీర్చే 
అదాయవనరులై
తల్లిదండ్రులను అప్పుల ఊబిన తోస్తూ
రేపు వారినేదో ఉద్ధరిస్తారన్న
మితిమీరిన ఆపేక్షగల్గిన
ఎర్రిబావులోళ్ళు ఆతల్లిదండ్రులు 

నైతిక మానవ విలువలు 
గాలికొదిలేసిన
గలీజ్ గాళ్ళు 
పరమకంత్రీలు
పోరంబోకులు
పోకిరీచేష్టలు
జల్సాలు
వారి స్వీయనైజమై చెలరేగిపోతున్న మానవ బాంబులు 

డ్రగ్స్ కు బానిసలైన
 రేపటి తరం 
అనారోగ్యం 
మొండితనం 
అజ్ఞానం 
ఉన్మాదపు ఊబినకూరుకుపోతున్న
వారిని
మీ వైఖరి మార్చుకోండని
మందలించి 
పేరెంట్స్ కు తెలియజేసిన
కర్మానికి 
వేటాడి వెంటాడి రెక్కినిర్వహించి
విద్యాబుద్ధులు నేర్పించిన ప్రధానాచార్యులునే
పొడిచి పొడిచి చంపారు 

వారి పోకిరీతనాన్ని ప్రశ్నించమే ఆమె నేరమా!
గురువు అంటే తల్లిదండ్రులంటారే
ఏది ఆగౌరవం బుద్ధి చెప్పడం 
బుద్ధి తక్కువతనమా!?
రేపటి రోజున 
ఈ పోకిరీలకు తల్లిదండ్రులు 
పాకెట్ మనీ కట్ చేస్తే 
వారి కన్నోళ్ళమెడమీదకత్తిపెట్టరా!?
ఇప్పుడు స్కూల్స్ లో పాఠాలు బోధించే 
ఉపాధ్యాయులు హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం 
లేకుంటే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి 
ఒక్కో విద్యార్థి ఒక మారణాయుధమే

విలువల పతనంతో
ఈజీ మనీ ఆడించే
జగన్నాటకమే
నైతిక మానవ విలువలు 
స్కూల్స్ కాలేజీల్లో తప్పని సరి 
సబ్జెక్టు చేయనంత కాలం
ఇలాంటి దారుణాలు 
మనం ఎన్నో చూడవలసి ఉంటుంది 
తస్మాత్ జాగ్రత్త 
పాఠం బోధించడం ఉపాధ్యాయులకు 
ఇప్పుడు కత్తిమీదసామే

కామెంట్‌లు