నిజమైన స్నేహం: - మధుప్రియ - తొమ్మిదవ తరగతి -\జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా - 9666063963
     

 అనగనగా ఒక గ్రామంలో శివ, రవి అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళ ఊరిలో చలి చాలా పెడుతుంది. వాళ్ళ ఇంటి పక్కన కుక్క ఉండేది. వాళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చునేది. అప్పుడు శివ కుక్కను తరిమి వేసేవాడు. 
           శివ నువ్వు ఎందుకు కుక్కను తరిమి వేశావు. కుక్క మూగజీవి కుక్కకు ఏమీ తెలియదని రవి అన్నాడు. శివ, రవి బడికి వెళ్తుంటే తోడుగా వచ్చిన కుక్క పిల్లలదొంగల ముఠా రవి, శివలను కిడ్నాప్ చేయబోతే కుక్క ప్రాణానికి తెగించి, వారిని కాపాడింది. ఆ క్షణంలో మాటలు లేకపోయినా, కుక్క చూపిన ప్రేమకు నమ్మకం మాటల కంటే గొప్పదనుకున్నారు.
         అందుకే శివ మమ్ములను కాపాడావు నీకు మంచి ఆహారం పెడతానని కుక్కతో అన్నాడు. రవి చెప్పినట్లు ఈ లోకంలో కొన్నిసార్లు మూగజీవులే మనకు నిజమైన స్నేహమంటే  నేర్పుతాయని, వాటికి స్వార్థం తెలియదు కానీ కృతజ్ఞత మాత్రం గుండెల్లో నుంచి వస్తుంది. 
====================================
నీతి: ఆపదలో ఆదుకునే వాడే అసలైన స్నేహితుడు.

కామెంట్‌లు