పుత్రులు తండ్రిని ఎట్లా చంపగలరు?
అట్లే! ఆత్మీయుడైన ఒక సోదరుడు
ఆత్మీయ సోదరుని ఎట్లు చంపగలడు?
రాజ్యమునకై ఆశతో నీవు ఇలా పలికినచో
ఆ రాజ్యము నీకే ఇవ్వుమని తెలిపేదను
భరతుడు నా మాటవిని సరే అనుచు
అతడు నా ఆజ్ఞను పాటించి తీరును
ధర్మాత్ముడైన శ్రీరాముడు ఇట్లుపలుకగా
శ్రీరాముని మాటలకు లక్ష్మణుడు సిగ్గుపడి
అన్నా! నీ చెంతకు మన తండ్రే వచ్చినట్లు
నేను భావించి అతనికి ఎదురు వెళ్ళెదను
ఓ లక్ష్మణా! తండ్రిగారి రథము కనబడుటలేదు
అదిలోకోతరమైనది, దివ్యమైనది
నాకు సందేహము కలుగుచున్నది
లక్ష్మణా! నా మాట వినినీవు చెట్టుదిగు
లక్ష్మణుడు మద్ది చెట్టు పై నుండి దిగి
దోసిలొగ్గి శ్రీరాముని ముందు నిలబడెను
భరతుడు సైన్యాన్ని దూరముగా ఉంచి
శ్రీరాముని అనుగ్రహము పొందుటకు విచ్చేసెను.
=====================================
అయోధ్యకాండమందు 97వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి