జేజేమ్మ సూక్తి ముక్తావళి: - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

బాధల్లో ఉపశమనము 
హృదయాలకు ఆనందము
 పలకరింపు ప్రేమతో
ఊరడించే మాటతో 

శ్రేష్టమైన స్నేహంతో 
బలమైన బంధంతో 
జీవితాల్లో ఎదుగుదల 
పున్నమి నాటి వెన్నెల 

సదనంలో పిల్లలతో 
గగనంలో చుక్కలతో 
అమితమైన అందమే 
పుడమిలోన మొక్కలతో 

గుండెలోని మోదంతో 
మోవిలోని నవ్వుతో 
చేకూరును ఆరోగ్యము 
స్వచ్ఛమైన తలపులతో 

కామెంట్‌లు