సానుకూల దృక్పథం ముఖ్యం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

చేస్తేనే ప్రయత్నము 
దరి చేరును విజయము 
అందరికీ ఈ విషయము 
సమగ్రంగా అవగతము 

ఉండాలి సంకల్పము 
చేయాలి కృషి సతతము 
ఈ సత్యం గ్రహిస్తే 
ఏదైనా సాధ్యమే

నిరంతర సాధనతో 
కడు ఆశాభావంతో 
విజయం వైపు అడుగులు 
సాగిపోవాలి దీక్షతో 

సానుకూల దృక్పథమే 
జీవితాల్లో దుర్గమే 
గెలిచేందుకు అనుకూలము 
అది బలమైన ఆయుధము 

కామెంట్‌లు