ప్రకృతి ప్రబోధం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

చిరుగాలి వీచిస్తే 
మృదువుగా తాకితే 
మమనకెంతో మోదము 
తనువుకెంతో పరవశము 

స్వచ్ఛమైన వాయువు 
పెంచుతుంది ఆయువు 
పెంచితే వృక్షాలు 
బాగుండును బ్రతుకులు 

మొక్కలను నాటి నాటి 
చెట్లను పెంచి పెంచి 
కాలుష్యం తరిమితే 
అందరికి మంచి మంచి 

ఆనాడే పూనుదాం 
మొక్కలను నాటుదాం 
కాసింత శ్రమనోర్చి 
ప్రగతి బాట వేద్దాం 

కామెంట్‌లు