పసి పిల్లలు -సిరిమల్లెల సొగసులు : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

పసి పిల్లల వదనాలు 
పరిమళించే కుసుమాలు 
ఆణువణువూ అందాలు 
దోచునోయి హృదయాలు 

మాటలు మకరందాలు 
ప్రవహించే సెలయేరులు 
ఆకట్టుకొనును మనసులు 
వారి మోవిని నగవులు 

కడిగినట్టి ముత్యాలు 
దైవానికి నిలయాలు 
చిన్నారుల హృదయాలే!
సుందర జలపాతాలే!

వారుంటే దీవెనలే!
విరజిమ్మును వెలుగులే!
గృహములు భూతల స్వర్గము 
అవుతుందోయ్! ఖచ్చితము 

కామెంట్‌లు