చిరుగాలితో చెలిమి : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

చిరుగాలి వీచిస్తే 
మనసుకెంతో మోదము 
శరీరాన్ని తాకితే 
అత్యంత ఆహ్లాదము 

చిరుగాలితో  స్నేహము 
ఎంతెంతో ఉపయోగము 
అదే గనుక లేకపోతే 
మానవ మనుగడ కష్టము 

నాసికతో సంబంధము 
సృష్టితో అనుబంధము 
ఆయుష్షును పెంచుతుంది 
ఆరోగ్యం పంచుతుంది 

వృక్షాలను పెంచాలి 
స్వచ్ఛ వాయువు పంచాలి 
చిరుగాలి కౌగిలిలో 
ఉపశమనం పొందాలి 

కామెంట్‌లు