అదృష్టం "బాలిక": --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

అందమైన బాలిక 
చిరునవ్వుల దీపిక 
సదనమనే  వనంలో 
గుబాళించు మల్లిక 

ఆదరిస్తే ఏలిక 
జాబిలమ్మ పోలిక 
భారతమ్మ మెడలో 
బంతిపూల మాలిక 

హాయినిచ్చు వీచిక 
గగనంలో తారక 
అదృష్టం చూడగా 
ముద్దులొలుకు బాలిక 

అసమానం  ఓపిక 
భూమాతకు ప్రతీక 
అర నవ్వుల బాలిక 
భగవంతుని కానుక 

కామెంట్‌లు