పుణ్యానికి ఫలితం : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

అనుభవమే చెపుతుంది 
అమూల్యమైన పాఠము 
అహంకారం చేస్తుంది 
జీవితాల్ని నాశనము 

అప్పులాంటిది పాపము 
వడ్డీ తీసుకుంటుంది 
నిప్పులాంటిది కోపము 
నిలువునా దహిస్తుంది

పొదుపులాంటిది పుణ్యము 
దైవానికి బహు ఇష్టము 
అవసరంలో అండగా 
ఉంటుంది ఖచ్చితంగా 

అందించిన సహకారము 
చేసినట్టి ఉపకారము 
వ్యర్థమై పోదు పోదు 
ఇచ్చును తప్పక ఫలితము 

కామెంట్‌లు